22, ఆగస్టు 2016, సోమవారం

సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్..

రాఘవేంద్రరావు గారి సినిమాలలో మాములు పాటలే ఒకరేంజ్ లో ఉంటాయి ఇక ఐటమ్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. కానీ ఈ పాట చిత్రీకరణ కన్నా విశ్వనాథన్ గారు కంపోజ్ చేసిన ట్యూన్ నాకు చాలా ఇష్టం.

ఆడియో ::
http://gaana.com/song/simhabaludu

ఈడియో ::


లిరికియో ::

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..
తళుకు బెళుకు కనవేరా
పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె..
పడుచు గొడవ వినవేరా

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
హా..కన్ను కన్ను గీటుకుంటె సన్న సన్న మంటరేగే..
కలికి చిలుక ఇటు రావే..హాయ్ ...హాయ్...
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె..
వలపు పిలుపు విని పోవే

బానిసగా వచ్చావు.. నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు.. నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు

రేయి తెల్లారి చల్లారి పోతుందీ రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతుందీ రారా సుందరా
ఒకటున్నది నీలో.. ఒడుపున్నది నాలో..
అది వున్నది లేనిది తెలుసుకో..హా
మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో..
అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో.. 

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..
తళుకు బెళుకు కనవేరా
ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె..
వలపు పిలుపు విని పోవే

ఈ ద్వీపానికి దీపానివి నువ్వు..
ఈ లంకకే నెలవంకవి నువ్వు హహహ హహ

మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే .. మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది .. వగరుందిలే.. సెగరేగిందిలే
వలపున్నది నాలో .. బలమున్నది నీలో ..
ఆ పట్టుని ఈ విడుపుని.. హా..కోరుకో...
సగమున్నది నాలో.. సగమున్నది నీలో ..
రెంటిని జంటగా మలచుకో..హాయ్

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..
తళుకు బెళుకు కనవేరా
వళ్ళు వళ్ళు మీటుకుంటే వగలమారి సెగలు పుట్టె..
వలపు పిలుపు విని పోవే
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్
 
సైన్మా ::  సింహబలుడు - 1978
దరువుల్ ::  ఎం.ఎస్. విశ్వనాథన్
రాతల్ ::  వేటూరి
గొంతుల్ ::  బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.

 

About Me

నా ఫోటో

మీలో ఒకడ్ని.. మీలాంటోడ్నే.. 
ఐటంరాజా పేరుతో ఐటంసాంగ్స్ లిరిక్స్ వీడియోలతో ఓ బ్లాగ్ నిర్వహిస్తుంటాను...  

మొత్తం పేజీ వీక్షణలు

ఆల్ ఐటమ్స్

2000స్ (5) 2010స్ (13) 50స్ (1) 70స్ (6) 80స్ (4) 90స్ (3) అనుష్క (1) అనూప్ రూబెన్స్ (1) అల్లరినరేష్ (1) అల్లు అర్జున్ (1) ఆరుద్ర (1) ఆర్.నాగేశ్వరరావు (1) ఇళయరాజా (1) ఉదయ భాను (1) ఎం.ఎస్.విశ్వనాథన్ (1) ఎల్.ఆర్.ఈశ్వరి (3) కత్రీన ఖైఫ్ (1) కళ్యాణి (1) కీరవాణి (3) కె.వి.మహదేవన్ (1) ఖుషి మురళి (1) గంగ (1) గాయత్రి (1) చక్రవర్తి (3) చిత్ర (1) చిరంజీవి (1) చైతన్యప్రసాద్ (1) ఛార్మీ (1) జయమాలిని (3) జానకి (3) జిక్కి (1) జ్యోతిలక్ష్మి (2) టిప్పు (1) టీవి (3) తమన్ (2) దివ్య (1) దీపు (1) దేవీశ్రీప్రసాద్ (2) ధనుంజయ్ (1) నవీన్ మాధవ్ (1) నాగార్జున (3) పవన్ కళ్యాణ్ (1) పార్వతీ మెల్టన్ (1) పెండ్యాల (1) ప్రభాస్ (2) ప్రీతి (1) బాలు (3) బిపాష (1) భాస్కరభట్ల (1) మణిశర్మ (1) మమతా (2) మలైకా అరోరా (1) మహేష్ బాబు (1) మిక్కీ జె మేయర్ (1) మొమైత్ ఖాన్ (1) మోహన (2) యానా గుప్తా (1) రమేశ్ నాయుడు (2) రమ్య (1) రవితేజ (1) రాజశ్రీ (1) రాజ్-కోటి (1) రాణా (2) రామజోగయ్య శాస్త్రి (2) రాశి (1) రేవంత్ (1) వరికుప్పల యాదగిరి (1) విశాల్ భరధ్వాజ్ (1) వెంకటేష్ (1) వేటూరి (5) శశిప్రీతమ్ (1) శివశక్తిదత్తా (1) శృతిహాసన్ (1) శ్రేయ ఘోషల్ (2) శ్వేతా పండిట్ (1) సందీప్ చౌతా (1) సమీరా రెడ్డి (1) సముద్రాల(సీనియర్) (1) సావిత్రి (1) సాహితి (2) సింహ (1) సినారె (2) సిరివెన్నెల (2) సిల్క్ స్మిత (3) సుచిత్ (1) సుద్దాల అశోక్ తేజ (1) సునీత (1) సుశీల (2) స్మిత (1) హలం (1) హెచ్చరిక (1) AbhiShek (1) Aishwarya (1) Alisha Chinoy (1) Amithab (1) Bappilahari (1) E.S.మూర్తి (1) Gulzar (1) helen (1) Hindi (6) Javed Ali (1) N.T.R (2) Parveen Babi (1) RD.Barman (2) Shankar-Ehsaan-Loy (1) Shankara Mahadevan (1)